ఎన్నేల్లో గోదారినేను మొన్న ఒకసారి తెలుగు బ్లాగులు తిరగేస్తుంటే "ఎన్నేల్లో గోదారి" కథ కనిపించి చదివాను. కథ నా మనసుని కలచి వేసింది నిజమే గోదారి చూడటానికి చాల చక్కగా వుంటుంది కాని ఇలాంటివి చూసినపుడు, చదివినప్పుడు అందమైన గోదారి లో కూడా ఇలాంటి క్రూరమైన సంఘటనలు వున్నాయని తలచుకుంటేనే చాలా బాధగా వుంటుంది.


కానీ వేణు వేదం గారు రాసిన కథ నిజమో కాదో నాకు తెలియదు కానీ కథలో చాలా బాధ నిరాశ నిస్పృహ కనిపించాయి. కానీ ఎవరికి ఎలా రాసిపెట్టి వుందో ఎవరికి తెలియదు కదా!.

కాని కథ లో చివరి లైన్ కి అర్ధం తెలియలేదు. " సరదాగా పారే గోదారి... ఎంత మంది శత్రువులున్నారో తెలియదుగానీ వారి సంఖ్య రెండు కంటే ఎక్కువని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను."

దయ చేసి ఎవరికైనా ఈ లైన్ కి అర్ధం తెలిస్తే నాకు కూడా తెలియజేయగలరు.

మూలం : http://teluguplaty.blogspot.com/

దెయ్యాలు, భూతాలు అసలు ఉన్నాయా?


దెయ్యాలు, భూతాలు అసలు ఉన్నాయా... లేదా అనే మీమాంస నేటికీ నెలకొని ఉంది. అయితే తాము భూతాన్ని చూశామనీ, దానిని తమ కెమేరాలో బంధించామనీ అంటోంది లండన్ అతీత శక్తులపై పరిశోధనలు చేసే బృందం. ఎన్నాళ్లగానో నోరా అనే భూతం లాంక్‌షైర్‌లోని బాకప్‌ రాజప్రసాదం థియేటర్‌లో నివాసముంటుందని ఆ థియేటర్‌ను సందర్శించినవారు చెప్పే మాట.

ఈ నేపధ్యంలో అసలు భూతం ఉందో లేదో తేల్చేస్తామంటూ పరిశోధకులు అక్కడికి వెళ్లారు. వారికి అక్కడ చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. భౌతికంగా ఎవరూ లేకుండానే వారికి అనేక అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో భూతం ఉన్న మాట నిజమేనని వారూ వంతపాడుతున్నారు. నోరా భూతాన్ని తమ కెమేరాల్లో బంధించి ప్రదర్శించారు కూడా. దాని ఫోటోను కెమేరా నుంచి కంప్యూటర్‌లోనికి డౌన్‌లోడ్ చేసినప్పుడు చిత్రం పారదర్శకంగా అగుపించిందట.

భూతానికి సంబంధించిన వివరాలను చూస్తే... 1892 కి ముందు కాలంలో ఓ ఇనుప కర్మాగారంగా ఉన్న ఈ థియేటర్ ఆ తర్వాత వినోదాన్ని అందించే స్థలంగా రూపుదిద్దుకుంది. ఇక అప్పటి నుంచి నోరా భూతం అక్కడ తిష్టవేసిందట. ఆ థియేటర్ తాలూకు వెబ్‌సైట్ సైతం తాము భూతం చేసే చిత్ర విచిత్రాలను చూశామని చెపుతోంది. అయితే థియేటర్‌లో ప్రవేశించినవారికి ఈ భూతం ఎటువంటి హానీ తలపెట్టదట. కనుక మన పెద్దవారు కథల్లో చెప్పినట్లు దెయ్యాలూ... భూతాలు ఉన్నమాట నిజమేనన్నమాట. అయితే మన కథల్లోనివన్నీ చెడ్డ దెయ్యాలు, ఇది మాత్రం మంచి భూతం.

మీరు చెప్పండి దెయ్యాలు, భూతాలు వున్నాయి అంటారా?

మూలం : వెబ్ దునియా

మనీప్లాంట్

కొల్లూరి సోమ శంకర్ గారు అనువదించిన మనీప్లాంట్ లో " పెరుగన్నం " కథ నాకు భలే నచ్చింది. ఆ కథ లో అంత చిన్న పాప మనసు ఎంత పెద్దగా ఆలోచించిందో చూడండి. ఈ రోజుల్లో అలాంటి పిల్లలు వున్నారో లేదో తెలియదు కానీ అటువంటి పిల్లల్ని చూస్తుంటే ముచటేస్తుంది కదా. కొల్లూరి సోమ శంకర్ గారూ ఈ కథని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలండి.